Friday, May 9, 2025
- Advertisement -

వైసీపీ ‘సిద్ధం’..జగన్ ఏం చెప్పబోతున్నారు!

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల శంఖారావానికి సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు సిద్ధం పేరుతో ఇవాళ విశాఖ జిల్లా భీమిలి వేదికగా సమరశంఖం పూరించనున్నారు సీఎం జగన్. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ శ్రేణులు భారీగా కార్యకర్తలను తరలించే ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 లక్షల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు.

ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లాలోని విశాఖపట్టణం–భువనేశ్వర్‌ జాతీయ రహదారిని ఆనుకొని తగరపువలస మూడు కోవెళ్లు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా ఏవిధంగా, ఏ సమయంలో సభా ప్రాంగణానికి చేరుకోవాలో ఇప్పటికే నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

ఇక ఈ సభా వేదిక నుండి కార్యకర్తలకు కీలక సూచనలు చేయనున్నారు జగన్. ఈ నాలుగున్న సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను ఫైనల్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని కార్యకర్తలకు వివరించనున్నారు. పూర్తిగా కేడర్ ను ఎన్నికలకు సిద్దం చేయటంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పికొట్ఆలో జగన్‌ వివరించనున్నారు. ఇక ఈ సమావేశం సందర్భంగా పలువురు కార్యకర్తలతో జగన్ స్వయంగా ముచ్చటించే అవకాశం ఉంది. మొత్తంగా వైసీపీ సిద్ధం సభ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -