Saturday, May 10, 2025
- Advertisement -

జగన్ మూడో జాబితా రెడీ?

- Advertisement -

ఏపీ సీఎం జగన్ మూడో జాబితా రెడీ చేశారు. మొదటి జాబితాలో 11 మందితో లిస్ట్ ప్రకటించగా రెండో జాబితాను 38 మందితో ప్రకటించారు. ఇక తాజాగా మూడో జాబితా రెడీ అయినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి మూడో జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.

ఇక ఇవాళ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సీఎం జగన్ ను కలిసేందుకు క్కాంప్ ఆఫీసుకు వెళ్లగా రేపటిలోగా మూడో ఫైనల్ జాబితా ఖరారయ్యే ఛాన్స్ ఉంది.

మొత్తంగా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జగన్. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున సిట్టింగ్‌ల మార్పుకు శ్రీకారం చుట్టారు. మూడో లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు రావాలంటూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లడంతో వారంతా జగన్‌తో సమావేశమయ్యారు. ఈసారి ఎంత మందితో జాబితా రిలీజ్ అవుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -