Friday, May 9, 2025
- Advertisement -

వైసీపీ మూడో జాబితా…కేశినేని నాని బంపర్ ఆఫర్

- Advertisement -

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్ధుల కసరత్తు చేస్తున్న సీఎం జగన్‌ తాజాగా ఐదు ఎంపీ స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలతో కలిపి మొత్తం 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ జాబితాను సిద్ధం చేసింది. మూడో జాబితాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలను బిసీలకు, ఒక స్థానం మైనార్టీ, మూడు స్థానాల్లో ఓసీలకు కేటాయించారు. ముందుగా ప్రకటించినట్లుగా బిసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీట్ల కేటాయింపు జరిగింది.

ఎంపీ స్థానాల్లో ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలు బిసీలకు, ఒక స్థానం ఓసీ, ఒక స్థానం ఎస్సీలకు కేటాయించారు. శ్రీకాకుళం నుంచి పేడాడ తిలక్, విశాఖ పట్నం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ స్థానానికి మంత్రి కార్మూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ స్థానానికి కేశినేని నాని, కర్నూలు ఎంపీ స్థానానికి గుమ్మలూరి జయరాం, తిరుపతి ఎంపీ స్థానం నుండి కోనేటి ఆదిమూలంకు అవకాశం కల్పించారు. ప్రకటించిన ఆరు ఎంపీ స్థానాల్లో అయిదు స్థానాలు బీసీలకు కేటాయించారు.

21 మంది జాబితాలో ఐదుగురు ఎస్సీ అభ్యర్ధులు ఉన్నారు. తిరుపతి ఎంపీగా పనిచేస్తున్న మద్దిల గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. మంత్రిగా పనిచేస్తున్న జోగి రమేష్ ను పెడన నియోజకవర్గం నుండి పెనములూరు నియోజకవర్గాన్నికి మార్చారు. మదనపల్లె నియోజకవర్గానికి మైనార్టీ వర్గం నుండి నిస్సార్ అహ్మద్ కు కేటాయించారు. మంత్రిగా ఉన్న గుమ్మలూరి జయరాం కు కర్నూలు ఎంపీ స్థానం కేటాయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -