Sunday, May 4, 2025
- Advertisement -

ఒక్క సినిమాలో 16 పాటలు!

- Advertisement -

ఒక సినిమాలో ఐదారు పాటలుంటేనే బోర్‌గా ఫీలవుతాం..అలాంటి ఏకంగా 16 పాటలుంటే. ఆ సినిమా చూసే పరిస్థితి ఉంటుందా? కానీ ఇలాంటి డేర్ చేశారు నటుడు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే తో వస్తున్నారు శర్వా. జూన్ 7న సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన శర్వా…సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో 16 పాటలు ఉన్నాయి… మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారన్నారు. నా కెరీర్ లో ఈ సినిమా రీ రికార్డింగ్ కోసమే ఎక్కువగా కూర్చున్నాను అని చెప్పుకొచ్చారు.

అలాగే ఈ లాంఛ్ ఈవెంట్లో శతమానం భవతి సీక్వెల్ గురించి చెప్పుకొచ్చారు శర్వా. శతమానం భవతి సీక్వెల్ గురించి దిల్ రాజు అనౌన్స్ చేశారు అని ప్రశ్నించగా.. దిల్ రాజు అనౌన్స్ చేశారా? ఆయన్నే అడగండి దాని గురించి, నాకు అయితే ఏం చెప్పలేదు అని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -