Wednesday, May 15, 2024
- Advertisement -

అ.. ఆ.. అంత బాగుంటుందా?

- Advertisement -

నితిన్, సమంతతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టిస్తున్న అ… ఆ.. సినిమా.. అప్పుడే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఆడియో కూడా రిలీజ్ కాకముందే.. ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. కొంత కాలంగా.. తనదైన పంచ్ ను మిస్ అవుతున్నాడన్న విమర్శలకు చెక్ పెట్టేలా త్రివిక్రమ్ శ్రీనివాస్.. అ..ఆ… సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ.. పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ శైలిలనే సినిమా ఉండనుందనీ.. కచ్చితంగా చెప్పాలంటే నువ్వు నాకు నచ్చావ్ లాంటి ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ సీక్వెన్స్ ను మళ్లీ గుర్తుకు తెచ్చేలా అ.. ఆ… సినిమా ఉండబోతోందనీ.. సమాచారం అందుతోంది.

వాస్తవానికి టైటిల్ తోనే.. సినిమాకు మంచి హైప్ వచ్చింది. క్రేజీ కాంబినేషన్.. అంతకన్నా క్రేజ్ ఉన్న డైరెక్టర్ అన్నీ కావడంతో.. అ..ఆ.. సినిమా మంచి విజయం సాధించడం ఖాయమన్న నమ్మకం.. చాలా మందిలో కనిపిస్తోంది. మరి.. ఈ అంచనాలను మాటల మెజీషియన్ అందుకుంటాడో.. లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -