Thursday, May 8, 2025
- Advertisement -

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో గెస్ట్ రోల్ లో ఎన్టీఆర్ కొడుకు

- Advertisement -

ఏ పరిశ్రమలో అయిన హీరోల కుమారులు చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మాములే. కృష్ణ కొడుకు మహేష్ బాబు దగ్గరనుండి రవితేజ కొడుకు మహాధన్ వరకు ఈ బాటలో సాగిన వాళ్లే. ఇప్పుడు ఈ కోవలోనే మరో హీరో కొడుకు కూడా సినీ అరంగేంట్రం చేసుందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ ముద్దుల కొడుకు అభయ్ రామ్ కూడా త్వరలోనే సినిమాలో కనిపించనున్నాడట. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా ఇటివలే ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు అభయ్ రామ్ కూడా వచ్చాడు. ఈ కార్యక్రమంలో అతనే హైలైట్ గా నిలిచాడు. అందరి కళ్లూ అతడి మీదే నిలిచాయి. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. పవన్, ఎన్టీఆర్ ఒకే వేడుకలో కనిపించడమే ఆసక్తి రేకఎత్తించేందంటే.. అభయ్ రామ్ సందడి కూడా తోడవడంతో ఈ వేడుక ప్రత్యేకంగా నిలిచింది.

చాలా చురుగ్గా కనిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు అభయ్ రామ్. ఈ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా అభయ్ కనిపించే అవకాశముందని.. త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకుడి చేతుల మీదుగా కొడుకుని వెండితెరకు పరిచయం చేస్తే బాగానే ఉంటుందని భావించి ఎన్టీఆర్ అంగీకరించాడని చెబుతున్నారు. మరి ఈ న్యూస్లో నిజం ఎంత ఉందో చూడాలి. ఈ మూవీని పవన్ మిత్రుడు రాధకృష్ణ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=kDqawj_1ygU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -