Sunday, April 28, 2024
- Advertisement -

మళ్లీ పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్

- Advertisement -

మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ గురించి అల్లు అర్జున్ మాట్లాడమంటే.. చెప్పను బ్రదర్ అన్న మాట.. పవన్ అభిమానులను బాగా బాధపెట్టింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య కొన్నాళ్ళ పాటు వార్ జరిగింది.

చివరికి ఈ విషయంపై అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వడంతో పవన్ అభిమానులు కాస్తా శాంతించారు. అయితే రీసెంట్ గా మళ్లీ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా మెగా హీరోలంతా పవన్ ను విష్ చేశారు. అల్లు అర్జున్ కూడా పవన్ కి విష్ చేశాడు. అయితే అల్లు అర్జున్ గతంలో ఎంతో అప్యతగా ప్రేమగా.. బాబాయ్ అని పిలిచేవాడు. కానీ బర్త్ డే విషెస్ మాత్రం హ్యాపీ బర్త్ డే ‘PSPK’ అని ట్విట్ చేశాడు. బన్నీ చెప్పిన విధానం పవన్ కళ్యాణ్ అభిమానులకి నచ్చలేదు.

దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మండిపోయింది. అసలు నిన్ను ఎవరు పవన్ కళ్యాణ్ కి విష్ చేయమ్మన్నారు అని సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు పవన్ అభిమానులు. మరి ఈ వార్ కి ఇంకా ఫుల్ స్టాప్ అనేది ఉండదా అని నెటిజన్లు చచించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -