Saturday, May 3, 2025
- Advertisement -

చైతూ – శోభిత వివాహం..అతిథులు వీరే!

- Advertisement -

అక్కినేని ఇంట పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ వివాహం జరగనుండగా ఇప్పటికే హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇక ఈ పెళ్లి వేడుకను సింపుల్‌గా అతి కొద్ది మంది సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన కొద్ది మంది మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాహుబలి ప్రభాస్, రాజమౌళి, పలువురు రాజకీయ నాయకులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పూర్తి సంప్రదాయ పద్ధతిలోనే చైతూ – శోభిత వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరగనుంది. ఇక ఇటీవలె అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రావడ్జీతో జరుగగా ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -