గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవాళ పెద్ది మూవీ గ్లింప్స్ ని ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు బుచ్చిబాబు దగ్గరుండి ఈ పనులన్నీ చూసుకుంటున్నారు. ఇటీవల రెహ్మాన్ కాస్త అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. అందువల్లనే ఫస్ట్ షాట్ ను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు.
ఇక ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయనుండగా ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా ట్రీట్ ఉండబోతుందనే తెలుస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ కీలకమైన పాత్ర పోషిస్తుండగా జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు శర్మ నటిస్తున్నారు. కెమెరామెన్ ఆర్. రత్నవేలు.. అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.