Tuesday, May 14, 2024
- Advertisement -

ఐదు భాషల్లో ’పుష్ప’.. బన్నీ ప్యాన్ ఇండియా స్టార్..!

- Advertisement -

ఈ రోజు టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు అతనికి బర్త్ డే విషేస్ తెలిజేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన పుష్ప ఫస్ట్ లుక్ ఈ రోజు బన్ని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

ఆ ఫొటోతో బన్నీ గందపు చెక్కల స్మగ్లర్ అంటూ క్లారిటీ వచ్చేసింది. ఇక రెండోసారి రిలీజ్ చేసిన పోస్టర్ ను కాస్త తీక్షణంగా దీర్ఘంగా పరిశీలిస్తే అందులో బన్నీ కాలుకు ఆరవ వేలు ఉంది. అయితే గతంలో అల్లు అర్జున్ కు ఆరవ వేలు ఉన్నట్లుగా తగంలో ఎక్కడ కూడా వార్తలు రాలేదు. కానీ ఈ పోస్టర్ చూస్తే బన్నీకి ఆరవ వేలు ఉంది. దర్శకుడు సుకుమార్ కథలో భాగంగా బన్నీకి ఆరవ వేలు పెట్టి ఉంటాడా లేదంటే డిజైనర్ పొరపాటున బన్నీకి ఆరవ వేలు పెట్టి ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.

ఈ పోస్టర్ చూస్తే డిజైనింగ్ పార్ట్ ఉంది. సో అది కథలో భాగంగా పెట్టిందే అని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్బంగా ఈ విషయం పై కూడా విశేషంగా చర్చ జరుగుతోంది. మరి ఆరవ వేలుపై సినిమా యూనిట్ స్పందిస్తారేమో చూడాలి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. ఈ సినిమాని తెలుగు,హిందీ,తమిళం,మలయాళం కన్నడ కలిపి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్న సినిమా ఇదే మొదటిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -