Saturday, April 27, 2024
- Advertisement -

విడాకుల తర్వాత ప్రేమలో పడ్డ అమలాపాల్ ?

- Advertisement -

అమలాపాల్ రూమర్లు, గాసిప్స్ తో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడిందన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకు ఆమె ఎవరితో సహజీవనం చేస్తున్నారంటే.. టాలీవుడ్ లో మంచి విజయాలతో దూసుకెళ్లిన అమలా అలానే కోలీవుడ్ లో కూడా మంచి సినిమాలు చేసింది.

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. విడాకులు తీసుకున్నారు. తర్వాత అమలా పాల్ పూర్తిగా కెరీర్‌పైనే దృష్టిపెట్టినా.. ఆమెపై గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం గాయకుడు, ముంబైకి చెందిన భవిందర్ సింగ్‌తో ప్రేమలో పడ్డారని, వారిద్దరి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారనే వార్తలు దక్షిణాది మీడియాలోనూ వినిపిస్తున్నాయి. అమలాపాల్, భవిందర్ సింగ్ కలిసి ఉన్న ఫొటోలు ఓ ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో వెలుగు చూశాయి.

వారిద్దరు సహజీవనం చేస్తున్నారడానికి బలం చేకూర్చేలా ఈ ఫోటోలు ఉన్నాయి. మరి ఈ ఫోటోలు భవిందర్ సింగ్ అఫీషియల్ అకౌంటా నుంచి వచ్చాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. అమలాపాల్‌, భవిందర్ సింగ్ గాఢంగా కౌగిలించుకొని, అతిసన్నిహితంగా కనిపిస్తున్న ఈ ఫొటోలు మాత్రం నెటిజన్లకు కిక్కిస్తున్నాయి. మరి అమలా అతనితో అయిన ప్రేమలోనే ఉంటుందో లేక పెళ్లి కూడా చేసుకుటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -