భర్తతో విడాకులకు కారణం దనుష్ ? స్పందించిన అమలాపాల్..!

హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకుని.. కొన్నిరోజుల తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌ తండ్రి, నిర్మాత ఏఎల్‌.అళగప్పన్‌ చేసిన వ్యాఖ్యలు అమలాపాల్‌కు కోపం తెప్పించాయి.

తన కుమారుడు అమలాపాల్ నుంచి విడాకులు తీసుకోవడానికి కారణం హీరో ధనుష్ అంటూ కామెంట్స్ చేశాడు. తాను నిర్మించిన ’అమ్మ కణక్కు’ సినిమాలో నటించమని అమలాపాల్ ను ఆయన కోరాడని చెప్పాడు. దాంతో.. పెళ్లి జరిగాక నటించనని చెప్పిన అమలాపాల్ మళ్లీ నటించడానికి సిద్దమైన క్రమంలో అమలాపాల్, విజయ్ కు మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. ఈ విషయంపై అమలాపాల్ ను మీడియా అడగటంతో ఆమెకు కోపం వచ్చింది.

ఎప్పుడో జరిగిన విషయం గురించి ఇప్పుడు అడగటం ఏంటి. విడాకులపై ఇప్పుడు చర్చ అనేది అనోసరం. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని తెలిపింది. అందుకు ఇతరులెవరూ బాధ్యులు కారని చెప్పింది. అసలు ఇతరుల కారణంగా ఎవరైనా వివాహాన్ని రద్దు చేసుకుంటారా? అని నిలదీసింది. ఇక తాను మరో పెళ్లి చేసుకోవడానికి టైం ఉందని తెలిపింది.