Sunday, May 4, 2025
- Advertisement -

అర్జున్ రెడ్డికి షాక్ ఇచ్చిన అనసూయ..?

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమా చూసి.. ప్రేక్షకులే కాదు.. సినీ ప్రమఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అర్జున్ రెడ్డి సినిమాలోని.. వాస్తవికతని.. అందరూ మెచ్చుకోవడం.. మంచి విషయం అయినప్పటికి.. బయట కూడా అలానే వుండండంటు విజయ్ దేవరకొండ యువతకి సలహాలివ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు.

‘మాద..ద్‌’ అనేది మాములుగా వాడే పదం అయిపోయినట్టు.. దానిని జోక్ గా వాడేస్తున్నారు పిల్లలు. ఆ విధంగా రెచ్చగొట్టిన.. హీరో విజయ్ దేవరకొండపై విరుచుకుపడింది యాంకర్ అనసూయ. ‘మీ ఆడవాళ్లని ఎవరైనా దూషించినా, వారితో చెడుగా ప్రవర్తించినా వాళ్ల తల్లుల్ని తిట్టమని చెబుతున్నావా? ఇదేమి పద్ధతి. నువ్వు ఎదగాలి డూడ్‌’ అంటూ అనసూయ.. డైరెక్టుగా విజయ్ దేవరకొండకే చెప్పేసింది.

తాను.. ఇంకా ఈ సినిమా చూడలేదని.. చూడాలని ఉన్నప్పటికి.. విజయ్ చెప్పిన డైలాగ్స్ తో ప్రభావితమైన జనం.. థియేటర్లో ఎక్కడ ఆ మాట అరుస్తుంటారో అనే భయంతో.. ఇంకా సినిమాకి వెళ్లాలేదని చెప్పింది అనసూయ. అర్జున్ రెడ్డి టీం.. తమ టాలెంట్ సినిమాలో చూపించాలని కానీ.. ఇలా.. పబ్లిక్ లో మాట్లాడటం తగదని హితవు చెప్పింది. మరి ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఏమంటాడో చూడాలి. తన స్టైల్ లో ఆంటీ చిల్ అంటాడా లేక.. తప్పు ఒప్పుకుంటాడా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -