యూవీ క్రియేషన్స్ సంస్థ టాలీవుడ్ లో మంచి సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రభాస్ మిర్చి తో మొదలైన ఈ సంస్థ ఇప్పటివరకు మంచి విజయాలనే అందుకుంది. ప్రభాస్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న ఈ సంస్థ.. పెద్ద హీరోలతోనే కాకుండా.. చిన్న హీరోలతో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.
గత ఏడాది శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా తో మంచి హిట్ అందుకున్న యూవీ క్రియేషన్స్ ఇప్పుడు మళ్లీ అదే హీరోతో మహానుభావుడు అనే సినిమాను నిర్మించింది. ఆ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. అయితే సినిమా స్పెషల్ షోని నిర్మాతలు స్వీటీ అనుష్క కు చూపించారు. ఎందుకంటే ఆమె అదే సంస్థ నిర్మిస్తున్న బాగమతి సినిమాలో నటిస్తోంది. సినిమా చూడాలని కోరడంతో నిర్మాతలు అమ్మడికి స్పెషల్ షో వేశారు. అయితే ఆమెతో పాటు హీరోయిన్ మెహ్రీన్ పిర్జాద కూడా సినిమాను చూసింది. ఇద్దరు ఒక సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే చాలా రోజుల తర్వాత స్వీటీ దర్శనం ఇచ్చింది. సినిమా చూసిన అనుష్క.. శర్వా, మెహ్రీన్ చాలా బాగా చేశారు. వారి మధ్య లవ్ ట్రాక్ చాలా బాగుందని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. సినిమాలో కామెడీ చాలా బాగా వర్కవట్ అయిందని.. సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధిస్తోందని అన్నదట. దర్శకుడు కూడా ఈ సినిమా బాగా తెరకెక్కించాడని తెలిపినట్లు తెలుస్తోంది.