ప్రస్తుతం హాట్ హాట్ టాపిక్ గా నడుస్తోంది.. అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఎన్నో వివదాల మధ్య రిలీజ్ అయ్యి.. మంచి విజయం సాధించింది. అయితే ఇప్పటికే ఈ సినిమాని చూడొద్దు.. ఈ సినిమాని ఆపివేయాలని కాంగ్రెస్ నేత.. హనుమంత్ రావు అన్నారు. అంతేకాకుండా ఓ దర్శకుడు ఈ సినిమా కథ అని వివదాంకు దిగాడు. ఇలా ఇన్ని జరుగుతున్న.. అర్జున్ రెడ్డి.. భారీ కలెక్షన్స్ తో.. దూసుకెళ్తోంది.
అయితే ఇదే విషయంపై అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇలా సినిమాలో బూతులు ఎలా అంటారు.. ఇలా చేయడం చాలా చీప్ గా ఉంది. నీ లైఫ్ లో ఉన్న మహిళ గురించి తప్పుగా మాట్లాడితే.. అప్పుడేం చేస్తావ్ డ్యూడ్ అంటూ చివరిలో యాష్ ట్యాగ్ పెట్టి అర్జున్ రెడ్డి ని తీవ్రంగా టార్గెట్ చేసింది అనసూయ. అయితే ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి మాత్రం ఎవరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోమని.. ప్రేక్షకులు సినిమాని ఆధరిస్తున్నారని అన్నారు. మరోవైపు అర్జున్ రెడ్డి అభిమానులు ట్విట్టర్ లో అనసుయని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు.
అసలు తల్లి గురించి మాట్లాడేటప్పుడు ముందు నువ్వు కూడా ఒక తల్లివేనని గుర్తుంచుకొని వేషదారణ మార్చుకో, వేదాలు చెప్పడం ఎవరైనా చెప్తారు ఆచరించడం అనేది ఇక్కడ పాయింట్ అంటూ నెటిజన్లు అనసూయపై విమర్శలకు దిగుతున్నారు. అనసూయ నువ్వు ముందు బట్టలు సరిగ్గా వేసుకో, ఫ్యామిలీస్ చూసే టీవీ షోస్లో నువ్వు చేసే ఎక్స్ పోజింగ్ తగ్గించుకో అని అంటున్నారు అర్జున్ రెడ్డి ఫ్యాన్స్. శేకింగ్ శేషు ఓ షోలో వేసిన డబల్ మీనింగ్ డైలాగ్స్ కి సిగ్గుపడి ముసి ముసి నవ్వులు నవ్వినప్పుడు ఏమైండి నీ నీతి అని.. అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ అడుగుతున్నారు.