- Advertisement -

రామోజీ లో అనుష్క తో బాహుబలి బిజీ గా ..

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన సంచలనం బాహుబలి ఇప్పుడు భారత దేశ వ్యాప్తంగా సెకండ్ పార్ట్ కోసం అందరూ ఎదురు చూసేలా చేసింది. బాహుబలి దీ కంక్లూజన్ అంటూ రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రాజమౌళి అతని బృందం చాలా బిజీ గా గడుపుతున్నారు.

మొన్నటి వరకూ హైదరాబాద్ అవుట్ స్కర్ట్ లో అల్యూమీనియం ఫాక్టరీ దగ్గర ఈ సినిమా షూటింగ్ జరగగా ఇప్పుడు రాజమౌళి తన బృందం తో సహా రామోజీ ఫిలిం సిటీ కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ బాహుబలి సినిమా మొదటి భాగానికి సంబంధించి చాలా నే షూటింగ్ పార్ట్ జరిగింది. అలాగే రెండవ భాగానికి కూడా ఇక్కడే షూటింగ్ జరుగుతోంది.

ఫిలిం సిటీ లో ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ ల మధ్య ప్రభాస్ – అనుష్క వెళుతూ ఉండగా వారి వెనకాలా జూనియర్ ఆర్టిస్ట్ లు పరిగెడుతున్న విశేషాలు కనపడుతూ ఉన్నాయి. కొన్నాళ్ళ పాటు టీం ఇక్కడే షూటింగ్ జరుపుకాబోతోంది. మొదటి భాగం సమయంలో ప్రభాస్ తో సహా అందరు యాక్టర్ లకీ రామోజీ ఫిలిం సిటీ సెకండ్ హోమ్ గా మారిపోయింది . ఉదయం లేచిన దగ్గర నుంచీ ఇక్కడే సమయం గడిపిన బృందం ఇక్కడే స్నానం దగ్గర నుంచి తిండి కూడా తెప్పించుకునేవారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -