Tuesday, May 21, 2024
- Advertisement -

బాలయ్యబాబు సొంత ప్రొడక్షన్ పెట్టడానికి కారణమదేనా..?

- Advertisement -

బాలయ్యబాబు కూడా ఇపుడు సొంత ప్రొడక్షన్ పై దృష్టి సారిస్తున్నాడు. అందరి హీరోలకు సొంత డబ్బాలున్నా…తనకు లేదని ఫీలౌతున్నాడు. అందుకే రూట్ మార్చాడు. నేను సైతం అంటూ గళ మెత్తి చాటాలనుకుంటున్నాడు. అందుకే నందమూరి ఆర్ట్స్ కు ధీటుగా తన నిర్మాణ సంస్థను ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు.

చాలామందికి తెలియని విషయం బాలయ్యబాబు భార్య వసుంధర దేవి ఎప్పటినుంచో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నారనే టాక్ ఒకటి ఉంది. అంటే ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వసుందర ప్రవర్తిస్తున్నారన్నమాట. ఇక ప్రొడక్షన్ ఖర్చులు గురించి కూడా ఆవిడకు మంచి అవగాహన ఉందని చాలామంది చెబుతుంటారు. సో ఆ యాంగిల్ కూడా బాలయ్యకు వర్కవుట్ అవ్వొచ్చు.

బాలకృష్ణ 103వ చిత్రంగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ ను.. సొంత బ్యానర్ పై తన తొలి మూవీగా నిర్మించనున్నారు బాలయ్య. తన కలల వెంచర్ కు బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ అని బాలకృష్ణ నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ను బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ తో పాటు సాయి కొర్రపాటి.. విష్ణులు కలిసి నిర్మించనున్నారు. ఇప్పుడు తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఓ మాంచి ఆఫీస్ నిర్మాణం ప్రారంభించే పనిలో ఉన్నారు బాలయ్య. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక.. ఓ రీజన్ ఉంది. తన తోటి హీరోలందరూ ఎవరికి వారు ప్రొడక్షన్ హౌస్ లు పెట్టుకుని లాభాలు గడిస్తే లేనిది తానెందుకు సొంత కుంపటి పెట్టకూడదు అనుకునే ఇలా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -