Saturday, May 4, 2024
- Advertisement -

బాలయ్య కోపానికి బాబి బలి!

- Advertisement -

అఖండ బాలయ్య ఏం చేసినా సంచలనమే…ఆయకు కోపం, ప్రేమ రెండు ఎక్కువే. ఇక బాలయ్య సినిమాలు అంటే ఫ్యాక్షన్‌, ఆవేశంతో కూడుకున్నవి. అయితే సినిమాల్లో ఆవేశంగా కనిపించే బాలయ్య నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు సీరియస్‌గానే కనిపిస్తారు. తనతో ఫోటో దిగడానికి వచ్చిన వ్యక్తి సెల్ఫీ దిగినా లేదా ఏ మాత్రం తేడా చేసిన ఆవేశంతో ఆపుకోలేక కొట్టేస్తాడు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని సందర్బాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య బాబు…బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య రేంజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్ దగ్గరి నుండి అన్ని తానై చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్యను ఇంప్రెస్ చేసేందుకు ప్రత్యేకంగా డైలాగ్‌లు కూడా రాశారు బాబీ. వీటినే బాలయ్యకు వినిపించాలని తన టీంను పంపించగా ఆ డైలాగ్‌లు విని బాలయ్య చిర్రెత్తుకోచ్చారట.

అంతేగాదు ఆ టీంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట. దీంతో తాను ఎంతో ఇష్టపడి రాసిన డైలాగ్‌లే బాలయ్యకు నచ్చలేదంటే సినిమా షూటింగ్ సమయంలో తన పరిస్థితి ఏంటా అని బాబీ లోలోపల మదనపడిపోతున్నారట. వెళ్లింది తన టీం కాబట్టి సరిపోయింది…అదే బాబీ అయి ఉంటే సినిమా క్యాన్సిల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అక్కడున్న వారు గుసగుసలాడుకున్నారట. ఏదిఏమైనా బాలయ్యతో సినిమా అంటేనే సాహాసం. మరి ఈ క్రేజీ ప్రాజెక్టును బాబీ ఎలా డీల్ చేస్తాడు…బాలయ్యను ఎలా ఇంప్రెస్ చేస్తాడో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -