Friday, May 3, 2024
- Advertisement -

కొత్త ఇంట్లోకి బాలయ్య…ఎక్కడో తెలుసా?

- Advertisement -

అఖండ, వీరసింహారెడ్డి,భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు బాలకృష్ణ. ఇక ఈ సినిమాలు హిట్ కావడంతో రెమ్యునరేషన్‌ని సైతం అమాంతం పెంచేశారు. ఇప్పుడు ఒక సినిమాకు ఏకంగా రూ.28 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట బాలయ్య. ఇక 2024లో నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ‌ ఎంట్రీ ఇవ్వనుండగా అంతకంటే ముందే కొత్తింట్లోకి వెళ్లనున్నారు బాలయ్య.

ప్ర‌స్తుతం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని విశాలమైన భ‌వంతిలో ఉంటున్నారు బాలయ్య. కానీ ఇప్పుడు తన అడ్రస్ మార్చి జూబ్లీహిల్స్‌లోని కొత్త ఇంటికి మారనున్నాడని సమాచారం. ఇది మెగాస్టార్ చిరంజీవి ఇంటి సమీపంలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 2024లో బాలయ్య గృహ ప్రవేశం చేయనున్నాడని…శరవేగంగా ఇంటీరియర్ పనులు నడుస్తున్నాయట.

ప్ర‌స్తుతం ఉన్న ఇంటి ప‌రిస‌రాలు నిరంత‌ర ట్రాఫిక్ తో మ‌రింత ర‌ద్దీగా మారాయి. అందుకే ఇల్లు మారుతున్నార‌ని సమాచారం. భగవంత్ కేసరి తర్వాత బాబి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా చేస్తూనే తన తనయుడు మోక్షజ్ఞను ఆదిత్య 999 మ్యాక్స్ తో వెండితెరకు పరిచయం చేయనున్నారని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -