Monday, May 27, 2024
- Advertisement -

కళ్యాణ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య ?

- Advertisement -

బాలకృష్ణ బాబు చాలా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. ప్రేమ అయినా.. కోపమైనా.. ఎక్కువ చూపించడం బాలయ్య అలవాటు. అభిమానం ఉంటే దగ్గర తీస్తారు.. అతి ఎక్కువ అయితే ఒక్కటి ఇస్తారు. ఆయనంతే. దాచుకోవడం, పైకోదో మాట్లాడటం ఉండదు అంటారు సన్నిహితులు.

ఎలా అనుకున్నా సరే, బాలయ్యబాబుకి కొంచెం కోపం ఎక్కువే అని ఒప్పుకోక తప్పదు. ఆ కోపం వల్ల ఆయన మీడియాకి న్యూస్ గా మారుతుంటారు. అభిమానులకి చెంపదెబ్బల వేడి ఇంకా తగ్గక్కముందే, బాలకృష్ణ గురించి ఓ కొత్త వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఎంతవరకు నిజమో తెలియదు కాని, బాలయ్య నిర్మాత సి.కళ్యాన్ తో గొడవ పడ్డారట. బాలకృష్ణ 102 వ సినిమాకి ఆయనే నిర్మాత. ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏవో మనస్పర్థలు మొదలయ్యాయట. చిన్న చర్చ లాగా మొదలైనా, మాట మాట పెరిగిందని, ఈ క్రమంలో బాలకృష్ణ సి.కళ్యాణ్ ని బెదిరించారని గాలిలో కబుర్లు వస్తున్నాయి.

మరి ఇది గాలి కబురేనో, నిజమైతే ఆ వార్నింగ్ లో కంటెంట్ ఏమిటో తెలియదు. ఇక ఈ మూవీ సంగతికి వస్తే.. తమిళ స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆయన చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -