Friday, May 10, 2024
- Advertisement -

సొంత ఇళ్లు లేదు అనేవాళ్లకు కౌంటర్ ఇచ్చిన రాహుల్

- Advertisement -

సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు ఎప్పుడు ఫ్యాన్స్ తో దగ్గరగా ఉంటారు. తాము ఏం చేసిన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో పొగడుతలు ఉంటాయి. అలానే విమర్శలు కూడా చేస్తారు. మంచి పని చేస్తే పొగిడే నేటిజన్లు.. చేడు చేస్తే అదే రెంజ్ లో తిడుతారు.

అయితే కొంతమంది నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే సెలబ్రిటీలు అలాంటివారికి తమదైన శైలిలో కౌంటర్స్ కూడా ఇస్తుంటారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 విజేత, మాస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నెటిజన్లు ట్రోల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చి నోళ్లు మూయించారు. బిగ్ బాస్ సీజన్ 3లో రూ. 50 లక్షల ప్రైజ్ మనీ రాహుల్ సిప్లిగంజ్‌ గెలుచుకున్నాడు. అయితే ఈ ప్రైజ్ మనీతో తమ పేరెంట్స్‌కి సొంత ఇళ్లు కొనిస్తానని.. అలానే బార్బర్ షాప్ పెడతా అని గతంలో రాహుల్ చెప్పాడు.

అయితే ఇటీవలే ఓ ఖరీదైన బెంజ్ కారుని రాహుల్ కొన్నారు. అయితే చాలా మంది బెంజ్ కారు కొన్నందుకు విషెష్ అందిస్తుంటే.. మరికొంత మంది రాహుల్‌ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తల్లిదండ్రులకు ఇల్లు కొంటా అని నువ్వు కారు కొనుకున్నావా ? అని ట్రోల్స్ చేశారు. అందుకు రాహుల్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. హలో.. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి.. నేను ముందే ఫ్లాట్ కొన్నా.. అది రెడీ కావడానికి 7 నెలలు టైం పడుతుంది. టేస్ట్ ద థండర్… జస్ట్ చిల్’ అంటూ తన బెంజ్ కారు ముందు కూల్‌గా థమ్స్ అప్ తాగుతూ.. తనను ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు రాహుల్.

ఇక రాహుల్ ను ట్రోల్ చేసేవాళ్లకు రాహుల్ ఆర్మీ దిమ్మతిరిగే కౌంటర్స్ ఇస్తున్నారు. సొంత ఇల్లు లేకుంటే బెంజ్ కారు స్టార్ట్ కాదా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇక రాహుల్ పాటలు పాడుతునే సినిమాల్లో నటిస్తున్నాడు. క్రిష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు రాహుల్. ఈ చిత్రంలో రాహుల్‌కి జోడీగా రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -