Sunday, May 12, 2024
- Advertisement -

బోయపాటి శ్రీను కి కోపం తెప్పించిన రకుల్ ?

- Advertisement -

అల్లూ అర్జున్ కొత్త సినిమా సరైనోడు గురించి ఎక్కడ చూసినా వింత చర్చ సాగుతోంది. ఇంకా అధికారికంగా ఎవరూ ప్రేకతించక ముందరే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా టైటిల్ ని పబ్లిక్ గా చెప్పేయడం ఆశ్చర్యపరిచే విషయం. రకుల్ చేసిన పనికి టైటిల్ కాస్తా లీక్ అయిపొయింది. కాని దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం ఇంకా ఈ టైటిల్ తో శాటిస్ఫై అయినట్లు లేడు.

స్టయిలిష్ స్టార్ బన్నీ సొంత నిర్మాణసంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు…  సంక్రాంతికి సందడి చేసే స్టార్ హీరోల సినిమాల లిస్ట్ లో అల్లు అర్జున్ సినిమా కూడా చేరిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ వస్తోంది సరైనోడు ఫస్ట్ లుక్ తో… సంక్రాంతి కానుకగా సరైనోడు మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు బోయపాటి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

కాకపోతే మనోడు కేవలం ఫస్ట్ లుక్ విల్ బి అవుట్ అన్నాడు కాని.. సినిమా పేరును మాత్రం చెప్పట్లేదు. బోయపాటి శ్రీను కి ఈ విషయం కోపం తెప్పించింది ట. రకుల్ అలా పేరుని అధికారికంగా చెప్పడం ఏంటి అంటూ మండి పడ్డాడు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -