Saturday, April 20, 2024
- Advertisement -

మెగా హీరోతో బన్నీ హీరోయిన్

- Advertisement -

నటి కేథరిన్ మెగా ఆఫర్ కొట్టేసింది. మెగా స్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. త్వరలో ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసింది. ఆ సినిమా తర్వాత గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా కూడా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ అనేది వర్కింగ్ టైటిల్ తో చెలామణి అవుతోంది. అయితే త్వరలో ఈ చిత్రం టైటిల్ మారబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌కు తమ్ముడిగా హీరో రవితేజ నటిస్తున్నాడు. ఇక రవి తేజకు జంటగా కేథరిన్ ట్రెస్సా కనువిందు చేయబోతోంది. ప్రస్తుతం చిరు, రవితేజ, కేథరిన్‌ పై షూటింగ్ జరుగుతోంది.

మెగా ఫ్యామిలీ హీరో బన్సీ సరసన కేథరిన్ ‘ఇద్దరమ్మాయిలతో, సరైనోడు’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఏకంగా మెగా స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం బింబిసార , భళాతందానాన, నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -