Sunday, May 5, 2024
- Advertisement -

చిరు మూవీలో చరణ్.. అదిరిపోయే పాత్ర ఇదే..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సైరా నరసింహా రెడ్డి ఎవరు ఊహించని రెంజ్ లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులు కొల్లగొడుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో చిరు సరసన తమన్నా, నయనతార నటించగా రామ్ చరణ్ నిర్మించాడు.

అయితే వెండితెరపై చిరు, చరణ్ కలయికలో మరో సినిమా చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగారు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజం అవుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక సోషల్ మెసేజ్ కథతో ఈ సినిమాని కొరటాల తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చరణ్ పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. సో మెగా అభిమానులు మరోసారి పండగ చెసుకునే సినిమా రాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -