- Advertisement -

తమ్ముడికి చిరు చెప్పింది అదేనా?

- Advertisement -

పవన్ చేప్పినట్లే సర్దార్ ఆడియో వేడుకకు చిరంజీవి వచ్చాడు. తన తమ్ముడు పవన్ తో అనుబంధం గురించి చాలానే మాట్లాడాడు. అలాగే పవన్ సినిమాలు మానేస్తాడు అనే మాటలను చిరు తప్పు బట్టారు కూడా. నువ్వు రెండు గుర్రాల మీద స్వారీ చేయగల సత్తా ఉన్నవాడివి అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.

చిరు చెప్పిన మాటలు వింటే.. ఓ విషయం అర్ధమవుతుంది. నువ్వు ఎంచుకున్న దారిలో వేల్తునే సినిమాలు కూడా చేయి. మేమంతా నీ వేనక ఉన్నాం అన్నారు చిరు. సో పవన్ వెనకల సపోర్ట్ గా ఎప్పుడు చిరు ఉంటారు అని చెప్పకనే చెప్పాడు. సినిమాలు వదిలేసి కేవలం పాలిటిక్స్ లో మాత్రమే ఉండాలని చిరంజీవి తీసుకున్న నిర్ణయం కొంత బెడిసికొట్టిన విషయం మనకు తెలిసిందే.

అందుకే పవన్ ని సినిమాలు కూడా చేయమని చిరు సలహా ఇచ్చారని అనిపిస్తుంది కానీ.. దీని వెనక మరో అర్ధం కూడా వినిపిస్తుంది. పవన్ ఎంచుకున్న దారి అంటే.. జనసేనకు కూడా తన మద్దతు ఉంటుందని చిరంజీవి హింట్ ఇచ్చేసినట్లే అనిపిస్తోంది. మరి దీని వేనకల ఎంత నిజం ఉందో త్వరలోనే తెలుస్తుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -