Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4కి హోస్ట్ గా చిరంజీవి..?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇటీవలే ఈ సీజన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఫైనల్ కి వెళ్లిన రాహుల్, శ్రీముఖి, బాబా మాస్టర్, అలీ, వరుణ్ లలో ఫైనల్ విన్నర్ గా రాహుల్ గెలిచాడు. ఈ గ్రాండ్ ఫైనల్ కు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్బంగా గెలిచినా రాహుల్ కి విన్నర్ ట్రోపిని అందజేశారు. ఇక రన్నరప్ గా శ్రీముఖి నిలిచింది.

మొదటి నుంచి బిగ్ బాస్ కు మంచి రేటింగ్ వస్తుంది. ఈ మూడో సీజన్ కి కూడా అదే రేంజ్ లో రేటింగ్ వచ్చింది. ఇక వచ్చే ఏడాది రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 4కి హోస్ట్ గా ఎవరు వ్యవహరించబోతున్నారు అనే దాని పై ప్రేక్షకుల్లో అప్పుడే అంచానాలు మొదలయ్యాయి. తాజాగా నిన్నటి షోకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు, రాబోయే సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారని పలు టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి.

వాస్తవానికి అందుకోసమే ఆయనను ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగిందని అంటున్నారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ ప్యాన్స్ చాల ఖుషి అవుతున్నారు. ఇక బిల్లితెరపై మెగాస్టార్ ఎలా సందడి చేస్తారో ఇటీవలే బిగ్ బాస్ రెండో సీజన్ ఫైనల్ లో చూసాం. ఇప్పుడు ఆయనే బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తే అదిరిపోవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -