Thursday, May 9, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ః తారక్ కోసం నందమూరి కుటుంబంలో విభేదాలు, బాబు అడ్డుగోడలు

- Advertisement -

నందమూరి బాలకృష్ణ స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా కూడా బాలకృష్ణనే కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో హల్చల్ చేస్తోంది. నందమూరి జీవితకథను తెరకెక్కించే విషయంలో చంద్రబాబుకు ఉపయోగపడేలా బాలయ్య ముందుకెళ్తున్నాడని ఇతర నందమూరి కుటుంబ సభ్యులు ముందు నుంచీ కూడా అసంతృప్తితో ఉన్నారు. అయితే తన కూతురు నారా వారి ఇంటి కోడలు అయిన నేపథ్యంలో ప్రస్తుతం బాలయ్య అన్ని విషయాల్లోనూ పూర్తిగా బాబు చెప్పినట్టు నడుచుకుంటూ ఉన్నాడు. అలా చేయక తప్పని పరిస్థితి బాలయ్యది. అందుకే కథలో కూడా వెన్నుపోటు ఎపిసోడ్ అస్సలు లేకుండా తేజకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశాడు బాలయ్య. దాంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా కాంప్రమైజ్ అయ్యారు.

అయితే ఇప్పుడు మరో విషయంలో మాత్రం నందమూరి వారసులందరూ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం పట్టుబడుతున్నారు. రీసెంట్‌గా యంగ్ ఎన్టీఆర్ లుక్ కోసం బాలయ్యకు మేకప్ టెస్ట్ చేశారు. అయితే ఆ లుక్‌తో యూనిట్ వాళ్ళు ఎవ్వరూ కూడా కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తోంది. తెరపైన పూర్తిగా కామెడీ అయిపోయే అవకాశం ఉందని యూనిట్ మెంబర్స్, బాలయ్య సన్నిహితులు చెప్పడంతో బాలయ్య కూడా వెనక్కి తగ్గాడు. దాంతో ఇప్పుడు యువ ఎన్టీఆర్ కోసం వేరే హీరోని వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకుని నందమూరి వారసురాండ్రు, వారసులు మాత్రం యువ ఎన్టీఆర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని తీసుకోమని బాలయ్యపైన ప్రెషర్ తీసుకుని వస్తున్నారట. కథ విషయంలో చంద్రబాబు చెప్పినట్టుగా నడుచుకున్నప్పటికీ ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదని తారక్‌ని తీసుకోవాలని వాళ్ళు బాలయ్యపై ఒత్తిడి తెస్తున్నారట. అయితే రాజకీయాల్లోకి వస్తే ఎన్టీఆర్ ముందు లోకేష్ నిలబడలేడన్న ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్‌ని తెలుగు దేశం పార్టీకి పూర్తిగా దూరం చేసిన చంద్రబాబు……… టెంపర్ సినిమాకు ముందు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్‌ని తొక్కేయాలని చూశాడు. ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దని బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. అయితే ఎన్టీఆర్ మాత్రం కుట్రలను ఛేదించి సొంత శక్తితో… వరుస హిట్స్‌తో టాప్ రేంజ్‌కి వెళ్ళిపోయాడు. చంద్రబాబు తొక్కేయాలనుకున్న ఎన్టీఆర్‌ని బాలయ్య తను నిర్మిస్తున్న సినిమాలో…..అది కూడా యువ ఎన్టీఆర్ పాత్ర కోసం తీసుకునే ధైర్యం చేస్తాడా? లోకేష్‌కి కోపం తెప్పించే పని చేయగలడా? అయితే నందమూరి వారసులు మాత్రం వేరే యంగ్ హీరోని తీసుకోవద్దని….. తారక్ అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది…… సినిమా రేంజ్‌ కూడా పెరుగుతుందని బాలయ్యకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారట. చంద్రబాబుని ఎదిరించి బాలయ్య ఆ నిర్ణయం తీసుకోగలడా? యువ ఎన్టీఆర్ పాత్రలో తారక్‌ని చూడాలనుకుంటున్న నందమూరి వారసుల కోరిక నెరవేరుతుందా? అదే జరిగితే మాత్రం నందమూరి అభిమానులకు కూడా పండగే అనడంలో సందేహం లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -