శ్రీదేవి హీరోయిన్‌గా తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. బాలీవుడ్‌లోనే కాకుండా, తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అభిమాన నాయికగా అలరించారు.లక్ష పారితోషకం తీసుకున్న మొదటి హీరోయిన్‌గా ఆమెకు రికార్డు ఉంది.దీపికా పదుకోన్ బాలీవుడ్‌లో మోస్ట్ టాలెంట్ హీరోయిన్.అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్‌లలో దీపిక మొదటి స్థానంలో ఉంది.ఇప్పడు వీరిద్దరి సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది.
టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తారని ప్రచారం సాగుతోంది.ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి, సూపర్ హిట్‌గా నిలిచాయి.ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్ర కొద్దిసేపు ఉంటుందని, ఈ పాత్ర కోసం దీపికాను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. శ్రీదేవి ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి హోటల్ గదిలో అనూహ్యంగా మరణించిన విషయం తెలిసిందే.