దేవ కట్టా. వెన్నెల చిత్రం చూసాక…. ట్రెండీ చిత్రాలను తీర్చిదిద్దగలడని అతనిపై చాలామందికి పాజిటివ్ ఫీలింగ్ కల్గింది. ప్రస్థానంతో టాప్ డైరెక్టర్ గా ఇతని ప్రస్థానం మొదలైందని అందరూ ఓ అంచనాకు వచ్చారు.
అయితే ఆతరువాత అతను వేసిన స్టెప్పులు అతని కెరియర్ ను కుంగతీసాయి.వరుసగా వచ్చిన రెండు డిజాస్టర్స్ తో దేవకట్టా ప్రస్థానమే ముగిసిందా అన్న చందంగా మార్కెట్లో రూమర్లు వచ్చేసాయి.
దేవకట్టా కెరియర్ భాగా డిస్ట్రబ్ కావడానికి ప్రధాన కారణం…. ఆటోనగర్ సూర్య.అందుల్లో దేవ కట్టా టేకప్ చేసిన సబ్జెక్ట్… కృష్ణాజిల్లాలోని ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.
సినిమా షూటింగ్ టైమ్లో కూడా ఇదే విషయమై కాస్త రచ్చ జరిగింది. ఆ తరువాత మూవీ విడుదలయ్యాక సినిమాకు అనవసరంగా ఖర్చు పెట్టేసి దేవకట్టా బడ్జెట్ పెంచేశాడని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ విరుచుకుపడ్డాడు.
అక్కడితో ఊరుకోకుండా…. వెంకట్ తన గురించి అసత్య ప్రచారం చేసినట్లుగా స్వయంగా దేవానే చెప్పాడు.అలాంటి టైమ్లో దేవకట్టా సొంతంగా సినిమా తీసి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూశాడు.కాని మొహమాటానికి పోయి డైనమైట్ చేసి ఉన్న ఇమేజ్ కాస్త ఊడ్చేసుకున్నాడు. దీంతో ఇతని దగ్గరికి సినిమా తీయమని ఏ ప్రొడ్యూసర్ రావడం లేదు.నా చేతిలో మూడు నాలుగు కథలున్నాయి వినండి చెప్పినా….వినే నాదుడే లేడట.
అందుకే కాబోలు దేవకట్టా ప్రస్థానం ముగిసినట్లుగా చెబుతున్నారు. ఒకటి మాత్రం వాస్తవం. విషయమున్న దర్శకుడికి ఏదో ఒక టైమ్లో ఖచ్చితంగా హిట్ పడుతుంది.అది దేవకట్టా విషయంలోను జరుగుతుందే అనుకుందాం.