- Advertisement -
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఎన్టీఆర్ సోలో హీరోగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది దేవర.
ఇప్పటివరకు రూ.460 కోట్లు వసూళ్లు సాధించగా ఓ ఇంటర్వ్యూలో సినిమా సెకండ్ పార్టుపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు దర్శకుడు కొరటాల శివ. దేవరలో చూసింది 10 శాతమే. మిగతాది అంతా సెకండ్ పార్ట్‌లో ఉండబోతుంది అంటూ అంచనాలను మరింతగా పెంచేశాడు.
దేవర కంటే దేవర 2 ఇంకా బాగుంటుందని చెప్పాడు. ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్‌కి సంబంధించిన షూట్‌ని కొంతవరకు కంప్లీట్ చేశాం అని చెప్పారు. దేవర 2లో జాన్వీ పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలిపిన కొరటాల.. జాన్వీ పాత్రని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు అన్నారు.