Friday, May 9, 2025
- Advertisement -

జై లవ కుశ పాటలు కాపీ కొట్టిన దేవి శ్రీ ప్రసాద్

- Advertisement -

టాలీవుడ్ లో నందమూరి అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా.. ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. ఇండస్ట్రీ వర్గాలు ఈ సినిమా సృష్టించే రికార్డులపై కన్నేశాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్‌ లో కనిపించనున్నాడు.

ఇప్పటికే విడుదలయిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ మొదలుకొని, టీజర్స్, ఆడియో పాటల వరకు అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఇటివలే ఈ సినిమాకి సంబంధించిన పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ ఆడియోలో నాలుగు పాటలు ఉండగా ‘‘రావణా..’’ అంటూ సాగే పాట ఆడియో మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కానీ ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే దేవిశ్రీ తన మార్కయిన కాపీ ట్యూన్స్‌ను ఈ సినిమాలో కూడా వాడాడు. అదేంటీ.. దేవిశ్రీ కాపీ కొట్టాడా.. అని సందేహం రావొచ్చు. అయితే దేవిశ్రీకి తన సినిమాల్లోని ట్యూన్స్‌ను కాపీ కొట్టడం కొత్తేమీ కాదు.

ఇంతకు ముందు వచ్చిన జనతా గ్యారేజ్‌లో కూడా ఏకంగా మూడు పాటల్లో పాత ట్యూన్స్‌నే పెట్టాడు మనోడు. ఇప్పుడు ‘‘జై లవ కుశ’’ లోనూ ‘‘దోచేస్తా’’ అనే పాటలో శంకర్‌దాదా సినిమాలోని ట్యూన్‌ కాపీ కొట్టి ఏంచక్కా పెట్టేశాడు. ఇది గమనించిన కొందరు నెటిజన్లు ఈ పాటలోని ట్యూన్‌ను పాత పాటతో కలిపి సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు. ఏదేమైనా మళ్ళీ గుట్టుచప్పుడు కాకుండా కాపీ కొట్టేసిన ట్యూన్‌తో అడ్డంగా దొరికిపోయాడు దేవిశ్రీ ప్రసాద్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -