Thursday, April 25, 2024
- Advertisement -

అమలాపాల్ విడాకులకు తీసుకోవడానికి కారణం ఆ హీరోనా ?

- Advertisement -

తమిళ స్టార్ డైరెక్టర్ ఏ.ఎల్ విజయ్.. స్టార్ హీరోయిన్ అమలాపాల్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి జరిగిన రెండేళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్దాలు రావడంతో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగాఉన్నారు. అయితే ఆ ఇద్దరూ విడిపోవడానికి కారణాలు మాత్రం ఏ ఒక్కరూ ఇప్పటివరకూ వెల్లడించలేదు.

తాజాగా వీరి బంధం తెగిపోవడానికి కారణం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటూ విజయ్ తండ్రి ఏ.ఎల్ ఆళ్లగప్పన్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ధనుష్ కారణంగానే పెళ్లైన రెండేళ్లకే విజయ్-అమలాపాల్ విడిపోయారని ఆయన మండిపడ్డారు. విజయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత అమలాపాల్ సినిమాలకు దూరంగా ఉంటానని… భర్త చెప్పినట్లే నడుచుకుంటానని నిర్ణయించుకుంది. కానీ ధనుష్ అమ్మా కణక్కు అనే చిత్రంలో ఎలాగైనా అమలాపాల్ నటించాలని పట్టుబట్టాడుట. దీంతో ఆయన మాట కాదనలేక విజయ్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారుట.

అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి విజయ్-అమలాపాల్ మధ్య సమస్యలు ఉత్పన్నం అయ్యాయని తెలిపారు. అప్పటి నుంచే విజయ్ తో అమలాపాల్ సరిగ్గా ఉండేది కాదని…కారణం అడిగినా సరిగా బదులు ఇచ్చేది కాదని అన్నారు. దీంతో విజయ్ తండ్రి ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ సంచలనంగా మారాయి. అమ్మా కణక్కు చిత్రం తర్వాత అమలాపాల్ వరుసగా ధనుష్ తో సినిమాలు చేసింది. వేలై ఇల్లా పట్టాదారి.. ఆ సినిమా సీక్వెల్ లోనూ అమలాపాల్ నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్యా ఎఫైర్ ఉందని తమిళ మీడియా వార్తలు రాయడం సంచలనమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -