పవన్ కళ్యాణ్ ని నితిన్ మొదటి నుంచీ తన సినిమాలలో వాడుతూనే ఉన్నాడు, పవన్ రిఫరెన్స్ లేని నితిన్ సినిమా చాలా అరుదు అనే చెప్పాలి .
నితిన్ తన సినిమా లలో రీమిక్స్ పాటలు కూడా పెట్టేసి తన అభిమానాన్ని చాటుకోవడం లో దిట్ట. అసలు మెగా హీరోలు కూడా పవన్ ని ఇలా వాడుకోవచ్చా అని ఆశ్చర్య పోయే రీతిలో నితిన్ తన ట్యాలెంట్ చూపిస్తూ ఉంటాడు.
ఈ పరిస్థితి లో నితిన్ వరస ప్లాపులు పక్కన పెట్టి హిట్ లు మీద హిట్ లు కొడుతున్నాడు. ఇష్క్ సినిమా తో మొదలు అయిన నితిన్ సెకండ్ సుక్సేస్ఫుల్ ఇన్నింగ్స్ ఇప్పటి వరకూ వికెట్ పడకుండా సాగుతోంది. కొరియర్ బాయ్ కళ్యాణ్ కి కాస్త తేడా టాక్ వచ్చినా సినిమా ధియేటర్ లో జనాలు బాగానే ఉన్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే నితిన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న “అఖిల్” సినిమా కి పవన్ కళ్యాణ్ ని ఆడియో లాంచ్ చెయ్యమని కోరగా పవన్ ఒప్పుకోలేదు అని సమాచారం. తాను మొట్టమొదటి సారి ప్రొడ్యూసర్ గా మారి ఒక భారీ ప్రాజెక్ట్ ని చేతబూని మొదలు పెడితే పవన్ ఆశీస్సులు ఉంటాయి అని నితిన్ కోరుకున్నాడు కానీ అది జరగలేదు.
ఈ విషయం లో పవన్ కూడా తన షెడ్యూల్ ని పక్కన పెట్టి రాలేను అని చెప్పడం ఇద్దరి మధ్యనా పొరపొచ్చాలు రేపింది. అందుకోసం చాలా పంతం తో కావాలనే మహేష్ బాబు ని ఆడియో లాంచ్ కి నితిన్ స్వయంగా పిలిచి ఎలాగైనా అతను వచ్చేలాగా చేసాడు అంటున్నారు. ఈ విధంగా నితిన్ పవన్ కి తన సత్తా చూపించాలి అని అనుకుని ఉండచ్చు. లేదా పవన్ బిజీ గా ఉండడం వలన అఖిల్ సినిమా ఆడియో రెండవ సారి లాంచ్ చెయ్యడం అదీ వైజాగ్ లో జరగబోతోంది కాబట్టి అక్కడ పవన్ ని తీసుకువెళ్ళే ప్లన్స్ లో ఉండచ్చు.
ఏదేమైనా దేవుడిలాగా పవన్ ని కొలిచే నితిన్ కి ఈ రకమైన ఇబ్బంది పవన్ తీసుకురావడం దారుణం అంటున్నారు ఫాన్స్ కూడా.