Friday, May 3, 2024
- Advertisement -

నాగ్ కు పోటీగా దిల్ రాజు ఇంటర్వ్యూ

- Advertisement -

నాగార్జునకు దిల్ రాజుకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. దిల్ రాజు విషయంలో నాగ్ ఒకింత కోపంతోనే ఉన్నప్పటికీ…అతనితో ఉన్న వైరాన్ని ఓపెన్ గా చూపించడం లేదు. అలాగని చెప్పి అతనితో రాజీపడి సినిమాలకు కమిట్ కావడం లేదు. దిల్ రాజు టైమ్ ప్రజెంట్ చాలా భాగున్నప్పటికీ.. ఏదో ఒక రోజు మనోడికి టైమ్ దగ్గరపడుతుందని పరిశ్రమలో కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. అయితే దిల్ రాజు ఫిల్మీ పబ్లిక్ పల్స్ పట్టేయడంతో ఇప్పట్లో ఆయనకొచ్చిన ముప్పేమి లేదు.

కాని జనవరిలో రిలీజ్ చేయాలనుకున్న మిడిల్ క్లాస్ అబ్బాయిని మెగా కాంపౌండ్ రిక్వెస్ట్ మేరకు డిసెంబర్ కు మార్చాడు. అది కూడా నాగార్జున.. తన కుమారుడు అఖిల్ ను గట్టెక్కించాలని చూస్తున్న హలో చిత్రానికి పోటీగా దించాడు. దీంతో వార్ ఓపెన్ అయింది. డిసెంబర్ 6 వతారీకున నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రెస్మీట్ పెట్టి హలో చిత్ర యూనిట్ ఎవ్వరూ లేకుండానే తానే స్వయంగా రంగంలోకి దిగి సోలోగా డైలాగ్లు చెప్పేశాడు. పైగా ఎమ్ ఎసి తమకు ఏమాత్రం పోటీ కాదని నాగ్ వివరణ ఇచ్చాడు.

నాగ్ అలా ఎప్పుడైతే ఓపెన్ అయ్యాడో…వెంటనే అందుకున్న దిల్ రాజు..ఆతర్వాత రోజు అనగా డిసెంబర్ 7న అలాంటిదేం లేదంటూనే తన ఆఫీస్ లో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ఎమ్ సిఏ డిసెంబర్ 21న వస్తుందని. తమ చిత్రం భాగా వచ్చిందని పండగకు హిట్ అయ్యే చిత్రం ఇదే అనే అర్ధం వచ్చే విధంగా వివాదానికి కోల్డ్ వార్ ను షురూ చేశాడు.ఇద్దరు ఇలా ఒక్క రోజు వ్యవధిలో ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడంతో డిసెంబర్ మూడవవారం రిలీజ్ చిత్రాలకు పెద్ద పోటీ క్రియేట్ అయింది.ఒకవేల హలో చిత్రం తేడా కొడితే నాగార్జున దిల్ రాజుపై ఓపెన్ గానే ఫైర్ అవ్వొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -