Wednesday, May 15, 2024
- Advertisement -

చైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్

- Advertisement -

సాహసం శ్వాసగా సాగిపో షూట్ కాంప్లీట్ చేసుకోని  ‘మజ్ను’ షుటింగ్‍లో పాల్గొంటున్నాడు అక్కినేని నాగ చైతన్య. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘ప్రేమమ్’ సినిమాని తెలుగులో నాగ చైతన్య రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మొత్తం మూడ్ లవ్ స్టోరీలు ఉంటాయి.

ప్రస్తుతం ఈ సినిమాలో నాగ చైతన్య-శృతి హాసన్ మధ్యన వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 19వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. అక్కినేని అభిమానులు ఈ సినిమా టీజర్ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు.

పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్,మడోనలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిసున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -