Sunday, April 28, 2024
- Advertisement -

నా ఆకలి తీర్చావు..దర్శకుడి ఎమోషన్!

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి.పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తుండగా తాజాగా దర్శకుడు హరీష్ శంకర్‌…రవితేజకు శుభాకాంక్షలు చెబుతూ ఎమోషన్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మిస్టర్ బచ్చన్‌ తెరకెక్కుతోంది. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

నా ఆకలి తీర్చావు..నా ఆనందాన్ని పంచుకున్నావు..నా ఆవేశాన్ని అర్థం చేసుకున్నావు అంటూ రవితేజకు విషెస్ చెప్పారు హరీష్‌. నా ఆశలకి ఆయువు పోశావు.. ఇలా నేను ఎంత చెప్పినా.. ఏమి చేసినా తక్కువే..నాకు ఎన్నో జన్మలకు సరిపడేలా ఊపిరి పోసిన నీకు.. జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. షాక్, మిరపకాయ తర్వాత వస్తున్న మూడో చిత్రం ఇది. అజయ్ దేవగన్ ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా ‘మిస్టర్ బచ్చన్’ తెరకెక్కుతోంది. వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -