Friday, May 3, 2024
- Advertisement -

ముద్దు సీన్ చేయమంటే మరో సీన్ చేసిన హీరో..!

- Advertisement -

ఇప్పటి సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ మాములు అయిపోయాయి. అన్ని భాషల సినిమాల్లో ఇవి కామన్. అయితే ఇలాంటి సీన్ తెరకెక్కించేటపుడు ఓ హీరో చేసిన పని హీరోయిన్‌ని చాలా ఇబ్బంది పెట్టేసిందట. దీంతో వెంటనే సదరు హీరోయిన్ సెట్స్ నుంచి పారిపోయిందట. విషయంలోకి వెళ్తే.. సినిమా అంటే అన్నిరకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. కథ డిమాండ్ చేస్తే ముద్దులు కూడా పెట్టాలి.

ఈ క్రమంలో తమిళ సినిమా ఉట్రాన్‌ సెట్స్‌పై ఓ ఆసక్తికర సంఘటన చోటుచేయుకుంది. ఈ మూవీ కోసం ముద్దు సీన్ తీస్తుండగా.. ఆ హీరో పెట్టిన ముద్దు ధాటికి హీరోయిన్ తట్టుకోలేకపోయిందట. వెంటనే రగిలిపోయి సెట్స్ వదలి పారిపోయిందట. ప్రస్తుతం ఇది తమిళంలో హాట్ టాపిక్ అయింది. రోషన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో హిరోషిణి హీరోయిన్‌‌గా నటించింది. ఈ ముద్దు సీన్ లో హీరో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి.. స్మూచ్ సీన్ చేసాడని.. దాంతో హీరోయిన్ ఆ దర్శకుడిపై కోపంతో విరుచుకుపడిందని సమాచారం.

అయితే కథ చెప్పేటప్పుడే ముద్దు సీన్ గురించి చెప్పినప్పటికి.. అది షూటింగ్ లో మరీ ఇంత ఘాటుగా ఉంటుందని అనుకోలేదని అంటుంది హీరోషిణి. లిప్‌లాక్ అంటే పెదాలపై పెదాలు ఆనించడమని, స్మూచ్ అంటే పెదాలను దాటి నాలుకను చప్పరించడం అని చెబుతోంది సదరు హీరోయిన్. ఈ ఉదంతంతో ఆ చిత్ర దర్శకుడిపై కూడా హీరోయిన్ ఓ రేంజ్‌లో మండిపడిందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -