Thursday, May 16, 2024
- Advertisement -

అదృష్టం అంటే నానిదే!

- Advertisement -

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నాని రేంజ్ పెరిగిపోయింది. రెండేళ్ల క్రితం నాని నటించిన  పైసా, జెండాపై కపిరాజు చిత్రాలకు బయ్యర్లు లేక సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. భలే భలే మగాడివోయ్‍ సినిమాతో నాని రేంజ్ ఒకేసారి పెరిగిపోయింది.

ఈ సినిమాతో నాని తన సత్తా చాటడంతో ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాని ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి పోటి పడుతున్నారు. ప్రస్తుతం నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమా రిలీజ్‍కు రెడిగా ఉంది. భలే భలే మగాడివోయ్ చిత్రం ఇక్కడే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అద్భుతమైన కలక్షన్స్‌ రాబట్టింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‍లోనే  చిత్రం డెబ్బయ్‌కి పైగా థియేటర్లలో విడుదలవుతోంది. మరో సారి నానీ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టిస్తాడు అంటున్నారు. సో మరి భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల బానే అంచనాలు ఉన్నాయి. మరి నానికి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -