Sunday, May 5, 2024
- Advertisement -

వర్షిణితో కెమిస్ట్రీ స్పందించిన హైపర్ ఆది..!

- Advertisement -

జబర్దస్త్‌లో కమెడియన్‌గా హైపర్ ఆదికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇతని చేసిన స్కీట్స్ కి విపరితమైన క్రేజ్ ఉంది. అయితే ఆది జబర్దస్త్ తోపాటు ఢీ షోలో కూడా చేస్తూ ఉంటాడు. ఈ షోలో వర్షిణితో ఆది కెమిస్ట్రీ ప్రత్యేకంగా మారింది. రష్మీ, సుధీర్ జంటను బీట్ చేసే రొమాన్స్ ప్రదర్శిస్తున్న క్రమంలో తన అభిప్రాయాన్ని ఆది వెల్లడించారు.

రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ జంటకు ఎక్కువగా క్రేజ్ ఉంది. అయితే ఢీ షో కోసం కొత్తగా వర్షిణితో జంటగా వ్యవహరించాల్సి వచ్చింది. స్కిట్, షో కోసం అలా రొమాంటిక్‌గా వ్యవహారించాల్సి వస్తున్నది అని ఆది అన్నారు. అయితే ఆన్ స్క్రీన్ తప్ప మా మధ్య ఆఫ్ స్క్రీన్‌లో రొమాన్స్ ఉండదు అని ఆది చెప్పారు. నిజానికి నాకు డాన్స్ రాదు.

ఢీ షో కోసం నేను నేర్చుకొంటున్నాను. ఏదో నాకు వచ్చిన స్టెప్పులతోను అలా కెమిస్ట్రీ, ఫిజిక్స్ కలిపేస్తున్నా. కమెడియన్‌గా కాకుండానే డ్యాన్సర్‌గా, సింగర్‌గా ప్రయత్నిస్తున్నాను. ఛాన్స్ వస్తుండటం వల్లే నేను కొత్తగా ప్రయత్నించే అవకాశం దక్కుతుంది. ఢీ షో తర్వాత నా క్రేజ్ మరింత పేరిగింది. ఇంత మంచి ఆదరణను పొందడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా అని ఆది చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -