సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం భారతీయుడు 2. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో వస్తున్న ఈ హై ఓల్టేజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1996లో ఘన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా వస్తుండగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా రన్ టైం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 3 గంటల నాలుగు నిమిషాలు సినిమా ఉండనుందట. అంటే మూడు గంటలకు పైగా ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలి.
అది అంత చిన్న విషయమేమి కాదు. కానీ శంకర్ చేస్తున్న ఈ సాహసం చూస్తుంటే ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉందనే అంతా భావిస్తున్నారు. అందుకే లెంగ్తి రన్ టైం అయినా శంకర్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదట. జూలై 12న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇండియన్ 2.ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీ రోల్ పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించాయి.