Tuesday, April 30, 2024
- Advertisement -

నానిని అసహ్యించుకునేది ఒక్కరే .. – హను

- Advertisement -

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ గురించే ఎక్కడ చూసినా జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమా కి డైరెక్టర్ అయిన హనూ రాఘవపూడి కి నానీ కి ఒచ్చినన్ని ప్రసంసలు రావడం విశేషం. నానీ గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన హనూ ‘ నానీ లాంటి యాక్టర్ ని నేను ఇన్నేళ్ళ నా జీవితంలో ఎక్కడా చూడలేదు.

ఏ డైరెక్టర్ అయినా అతనితో ప్రేమలో పడిపోతాడు. కెమెరా కి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడు అతను. కెమెరా తనముందర ఉంది అని అసలు గుర్తు కూడా ఉండదు అనుకుంట అతనికి. అలాంటి వాడితో ఎన్నైనా సినిమాలు చేసేయాలి అనిపిస్తుంది ‘ అంటూ తన హీరో మీద ప్రసంసల వర్షం కురిపించాడు అతను. ‘‘ఒక అందమైన ప్రకృతి దృశ్యం ఏదైనా చూస్తే అది అంత సులువుగా మన మనసును వదిలిపోదు.

నాని నటన కూడా అలాంటిదే. అతడి నటన హావభావాలు అంత సులువుగా మనల్ని వీడిపోవు. నాని లాంటి నటుణ్ని నేనెక్కడా చూడలేదు. ఉన్నట్లుండి ఓ స్టన్నింగ్ ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. అది చూసి మతి పోతుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమా చేస్తూ అతడి హావభావాలు చూసి ఎన్నిసార్లు షాకయ్యానో.. ఎంత ఆశ్చర్యపోయానో మాటల్లో చెప్పలేను. ” అంటున్నాడు హను. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -