సినిమా రంగానికి చెందిన వారిపై పుకార్లు షికార్ చేయడం కొత్తేమీ కాదు. పలు సందర్భాల్లో సినిమా వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా ఈ పుకార్లకు అల్లు అర్జున్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇంతకి బన్నీ గురించిన పుకార్లు ఏంటంటే… అల్లు అర్జున్ పేరు మార్చుకుంటున్నాడని. ఇందుకు సంబంధించి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో వచ్చిన కథనాలు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే సినిమా రంగంలోని పలువురు ప్రముఖులు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) నమ్ముతారు. అదే విధంగా, అల్లు అర్జున్ కూడా తన పేరులో అదనంగా ఒక “U” లేదా “N” జోడించాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. దీనివల్ల బన్నీ కెరీర్ మరింత మారుతుందని చెబుతున్నారు.
ఈ ప్రశ్నకు సమాధానం అల్లు అర్జున్ తన తదుపరి సినిమా అధికారికంగా ప్రకటించినప్పుడు తేలిపోనుంది. ఒకవేళ బన్నీ పేరులో మార్పు లేకపోతే, ఈ పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు.
పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారారు అల్లు అర్జున్. ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా కన్ఫామ్ కాగా తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీతో కూడా ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేశాడని వార్తలు వస్తున్నాయి.