Saturday, May 4, 2024
- Advertisement -

బాలీవుడ్ ఆఫర్ వచ్చినప్పుడు.. ఏమైందంటే : జబర్దస్త్ వినోద్

- Advertisement -

జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కామెడీ షోలు ప్రేక్షకులను చాలా బాగా ఆలరిస్తున్నాయి. ఈ కామెడీ షోల ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. అంతేకాకుండా బాగా డబ్బులు కూడా సంపాధించుకున్నారు. ఇందులో ఇప్పటికే షకలక శంకర్, చలాకి చంటి, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి వాళ్ళు తెలుగు సినిమాల్లో సత్తా చాటుకున్నారు.

అయితే తాజాగా చమ్మక్ చంద్ర స్కిట్ లో లేడీ గెటప్ వేసే వినోదిని అలియాస్ వినోద్ ఏకంగా బాలీవుడ్ లో నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు చెప్పాడు. బాలీవుడ్ లో పూనమ్ పాండే నటిస్తున్న ఓ చిత్రంలో తనకు నటించే ఛాన్స్ వచ్చిందని అన్నాడు.

అయితే ఆ సమయంలో తనపై జరిగిన దాడి కారణంగా తన నటించిన డేట్లు మార్చుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అంతేగాక ఇప్పటికే తాను కొన్ని షూటింగ్ షెడ్యూలల్లో కూడా పాల్గొన్నట్లు తెలిపాడు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని.. అంతేకాకూండా లేడీ గెటప్ లో ఉన్న నన్ను కొంతమంది వేధించారని.. మరికొంత మంది లైంగికంగా కూడా వేధించారని వినోద్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -