బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్. కామెడీ ప్రొగ్రాం ప్రేక్షకుల మన్ననలు పొందించిన ఈ కార్యక్రమం ఎంతో ఫేమస్.జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ద్వారా వెండితెరకు పరిచయమైన నటులు ఎందరో. ఇక జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్ర. సోషల్ మీడియాలో తన సినిమాలు, ప్రొగ్రాంల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూ ఉంటుంది.
ఇక రీసెంట్‌గా తన ప్రియుడు సంతోష్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా. ఈ ఏడాది నవంబర్ లో పెళ్ళి అని అనౌన్స్ చేసింది కూడా. కానీ సడన్‌గా ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు.
ఈ విషయాన్ని స్వయంగా పవిత్రే వెల్లడించింది. తమ నిర్ణయాన్ని అర్డంచేసుకొని, ఈ కష్ట సమయంలో తమకి సపోర్ట్ గా ఉండాలని కోరారు. అంతేకాదు తన ఇన్‌స్టాలో సంతోష్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా డిలీట్ చేసింది పవిత్ర. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్‌గా మారగా పవిత్రకు సపోర్టుగా నిలుస్తున్నారు నెటిజన్లు.
