Thursday, May 2, 2024
- Advertisement -

ఆ హీరోయిన్లు ఎదురుపడితే జగపతిబాబు కౌగిలించుకొనేస్తాడట!

- Advertisement -

జగపతిబాబు.. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే పాత్రలను చేయడంతో జగపతికి తిరుగేలేదు. ఆయన హీరోగా నటించిన సినిమాలను తీసుకొంటే..

ఎక్కువశాతం వరకూ అందులో ఇద్దరు హీరోయిన్లే ఉంటారు. పాత తరం నటుల్లో శోభన్ బాబు.. ఆ తర్వాత జగపతి బాబు.. ఇలా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగినవారిగా పేరు తెచ్చుకొన్నారు. మరి జగపతి బాబు సినిమా స్టైలే కాదు.. ఆయన ఆఫ్ దిస్క్రీన్ రొమాన్స్ కూడా చాలా సార్లు చర్చకు వచ్చింది.

కొంతమంది హీరోయిన్లతో ఈ హీరోకి ఎఫైర్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాంటివాటిని జగపతి కూడా కొన్ని సందర్భాల్లో ఖండించాడు అనుకోండి. మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే.. జగపతి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. తనకు బాగా సన్నిహితురాళ్లు అయిన హీరోయిన్లను ఎదురుపడితే తాను కౌగిలించేసుకొంటానని ఆయన చెప్పాడు. ఈ వెస్ట్రన్ స్టైల్ తనకు అలవడిందని ఆయన వివరించాడు.

గతంలో అయితే సౌందర్యను ఇలా హగ్ చేసుకొనే చనువు ఉండేదని.. ఇప్పుడైతే ప్రియమణిని అలా కౌగిలించుకొనే చనువు ఉందని జగపతి వివరించుకొచ్చాడు. మొత్తానికి కుర్రకారును ఊరించే అలవాటే ఇది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -