Monday, May 6, 2024
- Advertisement -

దేవర న్యూ ఇయర్ ట్రీట్ రెడీ!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 4న విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా కీలకపాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతుండగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంతం నేపథ్యంలో కథ సాగనుంది. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ పాత్రలో తారక్ కనిపించనుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

న్యూ ఇయర్ ట్రీట్‌గా దేవర గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని బజ్. 2024 ఏడాది ఆరంభంతోనే బిగ్గెస్ట్ ట్రీట్ ని ఆశించవచ్చని యూనిట్ సభ్యులు చెబుతుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -