ఒక్క ట్రైలర్‌తోనూ విశ్వరూపం చూపించారు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల 35 సెకన్లున్న ఈ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంది.
ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌లో తీరప్రాంతంలో ఎలాంటి భయాలు లేని ప్రజలు నివసిస్తుంటారు. అక్కడ ఉండే భైరా (సైఫ్ అలీఖాన్) ఓ క్రూరమైన గ్యాంగ్‌తో ఆకృత్యాలకు పాల్పడుతుంటాడు. ఇలాంటి కొంత మంది కరుడుగట్టిన గ్రామస్థులకు భయాన్ని పరిచయం చేస్తాడు దేవర (ఎన్టీఆర్) . ఆ గ్రామాన్ని పెను ప్రమాదం నుంచి రక్షించే పవర్‌ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.
ఎన్టీఆర్ అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ఆశ్చర్యపరిచే ఎలివేషన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తుండగా భయానికి అర్థం చెప్పే ప్రతిరూపమైన పాత్ర ఒకటైతే.. భయపడుతూ ఉండే మరో పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. భైరా అనే అనే భయంకరమైన పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.