Friday, May 17, 2024
- Advertisement -

ఐఐటి స్టూడెంట్‌ గా ఎన్టీఆర్‌..!

- Advertisement -

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘నాన్నకుప్రేమతో’ చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండగా ఆయనకి సతీమణిగా అలనాటి హీరోయిన్‌ దేవయాని నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర ఏంటో లీకైంది. అదేంటంటే ఎన్టీఆర్‌ ఇందులో ఒక ఐఐటి స్టూడెంట్‌గా కనిపించనున్నాడట. అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్‌ తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకోబోతున్నాడని సమాచారం. అంతేకాదు ఈ చిత్రం షూటింగ్‌ ని ఇండియాలోని ఒక టాప్‌ ఐఐటి కాలేజ్‌లో చిత్రీకరించనున్నారని సమాచారం. ఎన్టీఆర్‌ ఇదివరకు ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రంలో కూడా స్టూడెంట్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -