నాన్నకు ప్రేమతో ఓ డిఫరేంట్ సినిమాని చేసి అందరిని అలరించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెలుగు సినీ పరిశ్రమలో అందరు స్టార్లు కన్నా ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే స్టార్ హీరో మన యంగ్ టైగర్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకి రెడి అయిపోతున్నాడు ఎన్టీఆర్. జనతాగ్యారేజ్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళితో బాహుబలిలో నటించనున్నాడు. కాగా జనతాగ్యారేజ్ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ మీద ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఏంటా అని అనుకుంటున్నారా..?
ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో యంగ్ టైగర్ ఓ యువ నాయకుడిగా కనిపించనున్నాడట. యువ నాయకుడిగా, మాస్ జనాలకు లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు నేతాజీ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు టాక్. కాగా గతంలో టెంపర్ లాంటి భారీ హిట్ అందించిన పూరి మరి ఈ సినిమా ద్వారా మరో హిట్ అను అందిస్తారేమో చూడాలి. కాగా మహేష్ తో జనగణమన అనే టైటిల్ తో, ఎన్టీఆర్ తో నేతాజీ అనే టైటిల్ తో చేస్తున్నాడన్న టాక్ కాస్త డిఫరెంట్ గా అనిపిస్తోంది.