Sunday, April 28, 2024
- Advertisement -

కల్కి వాయిదా..మేకర్స్ క్లారిటీ!

- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 AD. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే సోషల్ మీడియాలో కల్కి రిలీజ్‌కు బ్రేక్ పడినట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అని ప్రభాస్ పాదాన్ని చూపించారు. ఓ బీట్‌కు ప్రభాస్ కాలు మూమెంట్ వేస్తూ ఉంటుంది. దీనికి టా టక్కర టక్కరే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరశురాముడిగా, నాని కృపాచార్య పాత్రలో కాసేపు కనిపిస్తారని ప్రచారం జరుగుతోండగా క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -